ఆచంట: బాల్య వివాహాలపై అవగాహన అవసరం

72பார்த்தது
ఆచంట: బాల్య వివాహాలపై అవగాహన అవసరం
బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సూర్య కుమారి బాలికలకు సూచించారు. ఆచంట మండలం ఎ. వేమవరం ఉన్నత పాఠశాలలో కిషోర బాలికలకు అవగాహన సదస్సు బుధవారం జరిగింది. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం నెక్కంటి కృష్ణవేణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி