రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శనివారం భీమవరం రెండవ పట్టణంలోని 32, 33, 34, 35 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి నేడు తన వల్ల మేలు జరిగితేనే వైసిపి పార్టీకి ఓటు వేయండి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ప్రజలను అడుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.