భీమవరం అంభేడ్కర్ కూడలిలో ఏపి బహుజన జేఏసి ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 19 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. కార్యక్రమంలో జేఏసి నాయకులు మాట్లడుతూ విగ్రహ ఆవిష్కరణకు ప్రజలందరు తరలిరావలని పిలుపునిచ్చారు. బహుజన జేఏసి తరుపున సుమారు 500 మందితో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భీమవరం నుండి విజయవాడకు ర్యాలీ తరలిరావాలని కోరారు.