యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెంజెరువు శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన యలమంచిలి తూర్పు కాపు సంఘ సమావేశంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. సంఘ అధ్యక్షులుగా బొద్దపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా నక్కా శివశంకర్, కొటార్ సూరి ప్రకాష్ రావు, సెక్రటరీగా నగిరెడ్డి గణేష్, ట్రెజరర్‌గా ఉటా సతీష్, జాయింట్ సెక్రటరీగా కోడిగుడ్డు రమణ, సభ్యులుగా నానేపల్లి నరేష్, అత్తిలి నూకరాజు ను ఎన్నుకున్నారు.