ఈ నెల 22 తరువాత బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. ఈ నేపథ్యంలో 23 నుంచి అక్టోబర్ రెండో వారం వరకు ఉత్తరాంధ్రతో పాటు, ఏపీలో పలు చోట్ల అక్కడక్కడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 20 తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్నాయని, వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.