రాజకీయ నాయకుల వల్లే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ. గ్రామంలో రహదారి, మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జనసేన నాయకురాలు మోటురు శ్రీవేణి పాల్గొన్నారు.