విశాఖ నగరంలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారిని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.