యలమంచిలి మండలం ఏటి కొప్పాక గ్రామంలో ఆదివారం జరిగిన గ్రామ దేవత బండి మాంబ జాతరలో బాణసంచ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్వాహకులు నిర్వాహకులు భారీ స్థాయిలో బాణసంచాను కాల్చారు. ప్రతి ఏట ఈ జాతరలో బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ బాణసంచా ప్రదర్శనను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు జాతరకు వస్తుంటారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.