యలమంచిలి తూర్పు కాపు సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు అయింది. స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా బొద్దపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా నక్క శివశంకర్, కె సూరి ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా నగిరెడ్డి గణేశ్, కోశాధికారిగా వి. సతీష్, జాయింట్ సెక్రటరీగా కె రమణ, కార్యవర్గ సభ్యులుగా నానేపల్లి నరేశ్, అత్తిలి నూకరాజు ఎన్నికయ్యారు.