ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ ప్రగడ నాగేశ్వరరావును ఏపీ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా శనివారం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ప్రగడను పొత్తుల్లో భాగంగా చివరి నిమిషంలో తప్పించారు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా జనసేన గెలుపుకు ప్రగడ సహకరించారు.