విశాఖ జిల్లా పద్మనాభంలో కొండపై వెలసిన అనంత పద్మనాభుని దీపోత్సవాన్ని ఈ నెల 30న వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజున సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. గిరి మెట్ల ప్రారంభం నుంచి శిఖరం వరకు 1,286 మెట్లకు ఇరువైపులా ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారని ఆలయ ప్రతినిధులు తెలిపారు.