విశాఖ పశ్చిమ నియోజకవర్గం మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతుని వయసు 70 సంవత్సరాలు ఉంటుంది. మృతదేహం చుట్టుపక్కల వెతకగా ఎటువంటి ఆధారాలు లభించలేదని రైల్వే ఎస్సై శాంతారామ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.