విశాఖ: నా భర్త ఎలా చనిపోయాడో చెప్పండి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న తన భర్త తాతారావు ఎలా మృతి చెందాడో చెప్పాలని బంగారమ్మ డిమాండ్ చేశారు. 2017లో ప్లాంట్‌లో తాతారావు మృతి చెందాడు. అయితే ఇప్పటి వరకు అటు స్టీల్‌ప్లాంట్, ఇటు పోలీసులు తాతారావు ఎలా మృతి చెందాడన్న విషయాన్ని వెల్లడించలేదని ఆమె వాపోయారు. విశాఖ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎలా మృతి చెందాడో స్పష్టం చేయకపోవడంతో ఆర్థిక ప్రయోజనాలు ప్లాంట్ అధికారులు ఇవ్వడంలేదన్నారు.