హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15 వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా 15వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కారు నిర్ణయించింది. అంటే మొత్తం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది.