జిల్లాలో చేపట్టదలచిన అభివృద్ధి ప్రాజెక్టులపై విశాఖ కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా ప్రస్తావించిన అంశాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా పర్యాటక రంగానికి పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.