రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విశాఖలో రన్ ఫర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బ్రోచర్ విశాఖ నగర జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి ఆర్కే బీచ్, ఎన్టీఆర్ విగ్రహం నుండి, వైఎంసిఏ వరకు సాగుతుందనీ తెలిపారు.