సరిగ్గా పదేళ్ల క్రితం సంభవించిన హుద్‌హుద్ పెనుతుఫాన్. విశాఖను అతలాకుతలం చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో నష్టాన్ని సృష్టించింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఏళ్ల నాటి మహా వృక్షాలు నేలమట్టమయ్యాయి. రోడ్డు, రైలు, విమానాశ్రయానికి నష్టం వాటిల్లింది. ఆ విషాధానికి శుక్రవారంతో 11 ఏళ్లు పూర్తయ్యింది.