విశాఖ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. శ్రీనివాసరావును జీవీఎంసీ డ్రైవర్లు మంగళవారం కలిశారు. పలు సమస్యలను, జీతాల పెంపు తదితర సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లను గ్రూప్ త్రీ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.