విశాఖలో ఇరవై మూడవ విశాలాంధ్ర పుస్తక మహోత్సవాన్ని గురువారం మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుస్తక ప్రియుల కోసం అన్ని రకాల పుస్తకాలను ఒకే చోట దొరికేలా ఏర్పాటు చేస్తూ ప్రజాదరణ పొందుతున్న విశాలాంధ్ర సిబ్బందిని అభినందించారు. భారత దేశంలో రోజు రోజుకు పుస్తక పఠనం పెరుగుతుందని డిజిటల్ యుగంలో కూడా పుస్తకాల వైపు ఆసక్తి చూపుతున్న పాఠకులకు అభినందనలు తెలిపారు.