తాను చనిపోతూ మరో ఐదుగురు ప్రాణాలు కాపాడారు ఒడిశా చెందిన వ్యక్తి. ఈ నెల 9వ తేదీన ఒడిశాకు చెందిన నరేష్ పట్నాయక్ (32) ఇంట్లో స్పృహ కోల్పోయారు. ఆస్పత్రికి తరలించగా. చికిత్స అనంతరం బ్రెయిన్ డెడ్‌గా నిర్థారించారు. విశాఖలో జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో విశాఖ కిమ్స్‌లో శుక్రవారం ఐదుగురికి అవయవాలు అమర్చారు.