విశాఖ జిల్లాలో వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న టెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఏపీ టెట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు.