గిరి ప్రదక్షిణకు తరలివచ్చిన భక్తజనంతో సింహాచలం, అడవివరం ప్రాంతం జనసంద్ర మైంది. శనివారం సాయంత్రం గిరిప్రదక్షిణ ప్రారంభం కాగా. ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు అప్పన్నదర్శనం కోసం బారులుదీరారు. ప్రస్తుతం క్యూలైన్లలో భారీ భక్తులు బారులుదీరారు. వర్షం పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 5 లక్షలకు పైగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.