నూతనంగా నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కు నక్కపల్లి మండల జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు నానిబాబు బుధవారం తెలిపారు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని పాయకరావుపేట నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మత్స్యకార నాయకులు పీక్కి కోదండరాం, సకూరు భాస్కర్, బొడ్డ ప్రసాద్, కర్రీ రవి, తదితరులు పాల్గొన్నారు.