పాడేరు పట్టణంలో దసరా ఉత్సవాలలో భాగంగా పలు చోట్ల నవరాత్రులు పూజలు నిర్వహించిన అమ్మవారి విగ్రహాన్ని శనివారం ఊరేగించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి సాయిబాబా గుడి వరకు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకు వచ్చారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఊరేగింపు అనంతరం సమీప వాగులలో విగ్రహాల నిమజ్జనం చేశారు. వాగుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.