గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ ఆదేశించారు. రేంజ్ ఎస్పీలతో ఆయన బుధవారం జూమ్ సమావేశం నిర్వహించారు. పేకాట స్థావరాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, దాడులు నిర్వహించాలన్నారు. గంజాయి నియంత్రణలో భాగంగా డైనమిక్ వెహికల్ చెకింగ్స్ ఆకస్మికంగా చేపట్టాలన్నారు. బాణసంచా దుకాణదారులు, గోడౌన్లు వద్ద భద్రత ప్రమాణాలను పర్యవేక్షించాలన్నారు.