కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు శుక్రవారం నర్సీపట్నంలో డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకొని రూ. 10 వేల జీతం ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని ఇచ్చిన హామీని నేటికీ నెరవేరకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా వాలంటీర్లను ప్రభుత్వం అదుకోవాలన్నారు.