నర్సీపట్నం ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఇసుక దోపిడిని అడ్డుకున్న వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ అన్నారు. శనివారం నర్సీపట్నం క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ సీఐ ఇసుక దోపిడి దొంగలకు అండగా ఉన్నారన్నారు. సీఐ వైఖరికి నిరసనగా ఈ నెల 6న నర్సీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద శాంతియుత ధర్నా చేపడుతున్నామన్నారు.