మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం చోడవరం క్యాంప్ కార్యాలయంలో నాలుగు మండలాలకు సంబంధించి 8 మంది బాధితులకు 9, 97, 208 రూపాయాల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదుకోవడమే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ఈ మొత్తాన్ని సద్వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంకా ఎవరైన బాధితులు ఉంటే పూర్తి బిల్లులతో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.