మద్యం దుకాణాల లాటరీ సజావుగా పూర్తి అయింది. సోమవారం ఉదయం 8 గంటలకు విశాఖ ఉడా చిల్డ్రన్ ఎరీనాలో మద్యం దుకాణాలు డ్రా మొదలైంది. జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీని నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ గజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు పూర్తి చేశారు. జిల్లాలో 155 దుకాణాలకు గాను 4139 అప్లికేషన్స్ వచ్చాయి.