విశాఖ వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రణాళికా విభాగపు సమీక్షా సమావేశంలో మెట్రోపాలిటన్ కమీషనర్ కె. ఎస్. విశ్వనాథన్ మాట్లాడుతూ భూ వినియోగ మార్పిడి కోసం వచ్చిన దస్త్రాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. అదేవిధముగా న్యాయపరమైన కేసుల పెండెన్సీని సాద్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.