ముచంగిపుట్టు మండలంలోని తుడుమురాయిలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సిసి రోడ్డు లేక ఏటా కురుస్తున్న వర్షాలకు గ్రామంలో ఉన్న మట్టి రోడ్డు బురదయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని గిరిజనులు వాపోతున్నారు. సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పంచాయతీ పాలకులకు అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు.ఇప్పటికైనా స్పందించాలని ఆదివారం కోరారు.