ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాలు

659பார்த்தது
ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాలు
అనకాపల్లి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లచ్చన్నఆదేశాల మేరకు గురువారం ఎస్ రాయవరం మండలం కొత్త పోలవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు, మహిళ సంఘాలు సభ్యులు కీ సమావేశం ఎర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయ విధానం లో నవధాన్యాలు గురించి రైతులుకి వివరించి చెప్పడం జరిగింది. తొలకరి వర్షాలుకు ముందుగా దుక్కు దున్ని 18 నుంచి 30 రకాల విత్తనాలు వేసుకుని వాటిని కలియ దున్నడం వలన ప్రధాన పంట కీ వచ్చే లాభాలు తెలియచేయడం జరిగింది. కొత్త పోలవరం గ్రామంలో మహిళ సంఘాల సభ్యులు రైతుల తో "నవధాన్యాలు సాగు - నేలతల్లి బాగు " అనే నినాదాలతో అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ ఉపయోగాలను నవధాన్యాలు వలన ఉపయోగాలు వివరించి చెప్పడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி