కోటఉరట్ల మండలం, రామచంద్రపురం గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించిన పర్వదినం పురష్కరించుకుని ఘనంగా ఉదయం నుంచి స్వామికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. గెంజి రమణబాబు రాము దంపతులు ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామిని దర్శించిన ప్రతీ ఒక్కరికి ప్రసాద్ పంతులు గారు గోత్రనామాలతో పూజలు జరిపి ప్రసాదాన్ని అందజేశారు. గ్రామ యువకులు అంతా కలిసి ముందుకు రావటం వల్లే ఆంజనేయ స్వామి పండుగ మహోత్సవం ఇంత వైభవంగా జరిపించగలిగాం అని పెద్దలు హర్షాభావం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం స్వామి అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తే ప్రజలు ఎంతో ఆనందంతో ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. అనంతరం రాత్రికి ఆలయం వద్ద దీపారాధన, భజన మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చెవ్వాకుల కుమారి(సర్పంచ్), గెంజి వెంకటరమణ (మాజీ సర్పంచ్ ), గెంజి సోమేశ్వరరావు( వైస్ సర్పంచ్ ), బత్తుల వెంకటరమణ, పులి సన్యాసిరావు (చంటి ), సుంకర నాగేశ్వరరావు దంపతులు, గెంజి చిరంజీవి మణికంఠ బ్రదర్స్, గంగల రమేష్, గెంజి చిన్నారావు, ఉగ్గిన కుమారస్వామి, తదితరులు పాల్గున్నారు.