పేషెంట్ ని పరామర్శించిన డా.బంగారయ్య

889பார்த்தது
పేషెంట్ ని పరామర్శించిన డా.బంగారయ్య
మంగళవారం రాయవరం మండలం, కర్రివానిపాలెం గ్రామానికి చెందిన కర్రి స్వాతి తీవ్ర అనారోగ్యంతో ఉంటే విశాఖపట్నం లో గల కింగ్ జార్జ్ హాస్పిటల్ లో బంధువులు జాయిన్ చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ కర్రి సూర్యనారాయణ గరు డాక్టర్ బంగారయ్యకి సమాచారం అందించగా వెనువెంటనే సిఎస్సార్ బ్లాక్ ఐఆర్సియూ లో వైద్యం పొందుతున్న పేషెంట్ వద్దకు వెళ్ళి డ్యూటీ డాక్టర్స్ తో వైద్యం వివరాలు తెలుసుకుని, తగిన వైద్యం అందించి అవసరం అయిన మెడికల్ పరీక్షలు అన్నీ త్వరగా చేయించాలని డాక్టర్స్ కి చెప్పారు. పేషెంట్ బంధువులుతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించి, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటానని చెప్పారు.
ఇప్పటికే అనేక మంది పేషెంట్లకు వైద్య సేవలు అందించాం అని ఎవరికైనా వైద్యసహాయం కొరకు అవసరం అయితే నెం: - 8333093121 కి ఫోన్ చేస్తే మీకు కె జి హెచ్ లో వైద్య సహాయం అందించుటకు మేము సహాయ చేస్తాం అని ఆయన వెంట వచ్చిన డాక్టర్ బి బి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி