రాంబిల్లి మండలంలోని గోకవరం గ్రామంలో ఆదివారం బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు టిడిపి రాంబిల్లి మండల శాఖ అధ్యక్షులు వి.దిన్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు గ్రామంలో ఇంటింటికి వెళ్లి టిడిపి మినీ మేనిఫెస్టో లోని అంశాలను తెలియజేసి,పార్టీ కరపత్రాలను అందజేశారు. దీన్ బాబు మాట్లాడుతూ టిడిపి జాతీయ నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.