కోటవురట్ల మండలం సుంకుపూరు గ్రామంలో రైతులు ముమ్మరంగా వరి నారులు వేయడం ప్రారంభించారు. వారితో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వరి విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేయించారు. ఎన్ఎఫ్ఏ రామ గోవిందు మాట్లాడుతూ వరి విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ది చేయడం వలన మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. గత పంటలో వచ్చిన తెగుళ్లను విత్తనం ద్వారా ప్రస్తుత పంటకు సంక్రమించకుండా నివారిస్తుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు బీజామృతం అందుబాటులో ఉంచారు.