కోటవురట్ల: ప్రారంభమైన పశుగణన సర్వే
కోటవురట్ల మండలంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన పశు గణన సర్వే 4 నెలల పాటు కొనసాగుతుందని మండల పశు వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ తెలిపారు. ఈ మేరకు స్థానిక పశు వైద్య కేంద్రం వద్ద సర్వేకి సంబంధించి పోస్టర్లను ఎంపీడీవో కాశీ విశ్వనాధరావు, స్థానిక సర్పంచ్ అనిల్ కుమార్, ఎంపిటిసిలు పీవీ సూర్యారావు, రాము, డాక్టర్ హరిప్రియ ఆవిష్కరించారు. పశువులు, మేకలు, గొర్రెలు, కుక్కలు తదితర వాటి వివరాలను నమోదు చేస్తామన్నారు.