విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సీఎం వినయ్ కుమార్‌ను బాధ్యతల నుంచి వర్సిటీ అధికారులు సోమవారం తొలగించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు ఆదేశాలు జారీచేశారు. ఆ బాధ్యతలను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహరావుకు అప్పగించారు. సదరు ప్రొఫెసర్‌పై ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు.