వేపాడ: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈఓ

62பார்த்தது
వేపాడ: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈఓ
వేపాడ కేజీబీవీ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మండల విద్యాశాఖ అధికారి పి. బాల భాస్కర్ రావు సోమవారం పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మెనూ క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఆయన అపార్ ఐడి కొరకు ఏర్పాటు చేసిన రెండు ఆధార్ కేంద్రాలను సందర్శించారు. ఈ మేరకు డిజిటల్ అసిస్టెంట్లకు పలు సూచనలు, సలహాలు చేశారు.

தொடர்புடைய செய்தி