వేపాడ మండలం జాకేరులో నిర్వహిస్తున్న శానిటేషన్, హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే, ఎన్ పి సి ఐ అప్డేట్ కార్యక్రమాలను ఎంపీడీవో సూర్యనారాయణ మంగళవారం పరిశీలించారు. సర్వే పనులను సత్వరమే పూర్తి చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన చేయకుండా మరుగు దొడ్లు వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.