అభివృద్ధి, సంక్షేమం మేళవింపుకు ప్రతిబింబంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ఎస్. కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు మంగళవారం ఎస్ కోటలో అన్నారు. గత పాలనలో మోసపోయిన పలు వర్గాల ప్రజలకు మేలు కలిగేలా బడ్జెట్ లో కేటాయింపులు చేయడం హర్షనీయమని, అమ్మ ఒడి, ఉచిత బస్సు పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఎన్నికల హామీలు అమలకు బడ్జెట్ అద్దం పట్టే విధంగా ఉందన్నారు.