జామి మండలం దొండపర్తి నుండి అలమండ, లొట్లపల్లి తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. స్థానిక జెడ్పిటిసి బండారు పెదబాబు చొరవతో మంగళవారం ఈ రహదారికి తారు రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. కాగా ఈ రహదారి గతంలో కురిసిన వర్షానికి పెద్దపెద్ద గోతులతో అధ్వాన్నంగా తయారైంది. ఈ రహదారికి తారు రోడ్డు నిర్మాణం చేపట్టడంతో స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.