వెనుకబడి జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ సృష్టి ఎంతవరకు జరిగింది అనే విషయాలు తెలియజేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర శాసనసభలో గురువారం ప్రశ్నించారు. గురువారం జరిగిన శాసనసభ సమావేశంలో ఆయన వివిధ విషయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో 8 వెనుకబడిన జిల్లాలు ఉన్నట్లు గుర్తించారని ఆ జిల్లాలో ఉద్యోగ సృష్టి ఎంతవరకు జరిగింది అన్న నివేదికలు స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.