భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పాటుపడిన పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనిదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలో కొత్తవలస శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వద్ద శుక్రవారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ఒక రాష్ట్రం ఉండాలన్న నినాదంతో ప్రాణాలను సైతం పనంగా పెట్టారన్నారు.