స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలకు ఈ నెల 28న పోలింగ్ జరగనున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. బుధవారం ఎన్నికలపై రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ ఆయన ఛాంబరులో సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికలు పాత జిల్లాల ప్రాతిపదికన నిర్వహిస్తున్నందని చెప్పారు.