మన్యం జిల్లాలో ప్రైవేట్ మద్యం షాపులకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 52 మద్యం దుకాణాలకు మొత్తం 1, 393 దరఖాస్తులు రాగా. రూ. 27. 86 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అయితే పట్టణాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాలకే మెరుగ్గా దరఖాస్తులు వచ్చాయి.