మన్యం జిల్లాలో 213 నీటి వినియోగదారుల సంఘాలు, 1560 ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని సాగునీటి వనరుల కింద ఉన్నటువంటి సాగునీటి సంఘాలకు నవంబర్ 21 నుంచి 29వ తేదీ వరకు వివిధ దశలలో ఎన్నికలు నిర్వహించుటకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు.