నెల్లిమర్ల మున్సిపాలిటీ పరిధి జరజాపుపేట గ్రామంలో 19 వ వార్డులో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం 19వ వార్డ్ కన్వీనర్ శ్రీ తుమ్ము నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ప్రతి గడపగడపకు వెళ్లి జగన్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా తర్వాత మరల ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ సముద్రపు రామారావు , రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్ము వెంకటరమణ, రాయి త్రినాథ్, మన్యపురి మోహన్ రావు, కనకల పైడిరాజు, సుద్దాపు రమణ,18 వ కన్వీనర్ శివప్రసాద్, కన్వీనర్లు, గృహ సారథులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.