కొమరాడ మండలం గాజులగూడ గ్రామానికి రహదారి మార్గం లేక నిండు గర్భిణిని కుటుంబీకులు రెండు కిలోమీటర్లు డోలిలో మోసుకొని ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హిమరిక రజిని అనే గర్భిణీ కి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఆపసోపాలు పడ్డారు. కెమిసిల గ్రామం వరకు మోసుకొని వచ్చి అక్కడనుండి మాదలంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.