బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గంట్యాడ మండలంలో మూడు సం. పాపపై జరిగిన అత్యాచార ఘటనను తెలుసుకున్న మంత్రి విజయనగరం గోషా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న పాప, కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. పాప ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాపకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి తెలిపారు.